గలతీయులకు 6:4-6
గలతీయులకు 6:4-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రతీ ఒక్కరు తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. వాక్యం ద్వారా ఉపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నింటిని పంచుకోవాలి.
గలతీయులకు 6:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
గలతీయులకు 6:4-6 పవిత్ర బైబిల్ (TERV)
ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.
గలతీయులకు 6:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.
గలతీయులకు 6:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.