గలతీయులకు 6:11-18

గలతీయులకు 6:11-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలను ఉపయోగించి మీకు వ్రాస్తున్నా! శరీర సంబంధమైన వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకునేవారు సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సిలువ కొరకు హింసించబడకుండ ఉండడానికే వారు ఇలా చేస్తారు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు కాని శరీరానుసారమైన మీ సున్నతిని గూర్చి వారు గొప్పలు చెప్పుకోడానికి మీరు సున్నతి పొందాలని వారు కోరుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడివున్నాము. సున్నతి పొందడంలో సున్నతి పొందకపోవడంలో అర్థమేమి లేదు, నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది. ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి. నేను నా శరీరంపై యేసు యొక్క గుర్తులను కలిగివున్నాను, కనుక ఇక నుండి ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండును గాక! ఆమేన్.

షేర్ చేయి
Read గలతీయులకు 6

గలతీయులకు 6:11-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా సొంత దస్తూరీతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి. శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు. ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్‌.

షేర్ చేయి
Read గలతీయులకు 6

గలతీయులకు 6:11-18 పవిత్ర బైబిల్ (TERV)

ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక. చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి. సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.

షేర్ చేయి
Read గలతీయులకు 6

గలతీయులకు 6:11-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తుయొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి యున్నాము. క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు. ఈ పద్ధతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్.

షేర్ చేయి
Read గలతీయులకు 6

గలతీయులకు 6:11-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలను ఉపయోగించి మీకు వ్రాస్తున్నాను! శరీర సంబంధమైన వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకునేవారు సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సిలువ కోసం హింసించబడకుండ ఉండడానికే వారు ఇలా చేస్తారు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు కాని శరీరానుసారమైన మీ సున్నతిని గురించి వారు గొప్పలు చెప్పుకోడానికి మీరు సున్నతి పొందాలని వారు కోరుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము. సున్నతి పొందినా పొందకపోయినా అది లెక్కకు రాదు. నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది. ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి. నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.

షేర్ చేయి
Read గలతీయులకు 6