గలతీయులకు 4:1-5

గలతీయులకు 4:1-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు, అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ, అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు. తన తండ్రి నిర్ణయించిన సమయం వరకు వారసుడు సంరక్షకులు మరియు ధర్మకర్తల ఆధీనంలో ఉంటాడు. అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు, ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాం. అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు, ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్న వారిని విడిపించాలని, తద్వార మనం పుత్రత్వాన్ని దత్తతగా పొందుకోడానికి.

షేర్ చేయి
Read గలతీయులకు 4

గలతీయులకు 4:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రిచేత నిర్ణయింప బడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును. అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి; అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

షేర్ చేయి
Read గలతీయులకు 4

గలతీయులకు 4:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు. తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు. అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాము. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.

షేర్ చేయి
Read గలతీయులకు 4