యెహెజ్కేలు 2:2-3
యెహెజ్కేలు 2:2-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నన్ను పట్టుకుని నా కాళ్ళపై నిలువబెట్టాడు. అప్పుడు ఆయన స్వరం నేను విన్నాను. ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
యెహెజ్కేలు 2:2-3 పవిత్ర బైబిల్ (TERV)
ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను. ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు.
యెహెజ్కేలు 2:2-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన నాతో మాటలాడి నప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.
యెహెజ్కేలు 2:2-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆత్మ నా మీదికి వచ్చి నా పాదాల మీద నన్ను నిలబెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడడం నేను విన్నాను. ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.