ఎస్తేరు 4:13-17

ఎస్తేరు 4:13-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు. నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది: “వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.” కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు.

ఎస్తేరు 4:13-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురంపాడు. “రాజ భవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు. నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడక పోతే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కునుండి వస్తుంది. అయితే నువ్వూ నీ తండ్రి వంశమూ నశిస్తారు. నువ్వొకవేళ ఇలాటి తరుణం కోసమే ఈ రాజరికానికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది. “షూషనులో ఉన్న యూదులందరినీ సమకూర్చి నాకోసం ఉపవాసముండేలా చెయ్యి. మూడు రోజులు ఏమీ తినవద్దు, తాగవద్దు. నేనూ నా దాసీలు కూడా ఉపవాసం ఉంటాము. చట్టవ్యతిరేకం అయినప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను.” మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు.

ఎస్తేరు 4:12-17 పవిత్ర బైబిల్ (TERV)

అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు. ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛా సహాయాలు మరొక చోటునుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచుకోబడ్డావేమో ఆలోచించుకో.” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ, పగళ్లూ అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినాలు ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను.” మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు.

ఎస్తేరు 4:13-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చి– రాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు; నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమునుబట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను. –నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడుదినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను. అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను.

ఎస్తేరు 4:13-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు. నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?” అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది: “వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.” కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు.

ఎస్తేరు 4:13-17

ఎస్తేరు 4:13-17 TELUBSI