ఎఫెసీయులకు 6:18-19
ఎఫెసీయులకు 6:18-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి ప్రభువు యొక్క ప్రజలందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి. సువార్త మర్మాన్ని నేను భయం లేకుండా తెలియజేయడానికి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు మాటలు అనుగ్రహింపబడేలా నా కొరకు కూడా ప్రార్థన చేయండి.
ఎఫెసీయులకు 6:18-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి.
ఎఫెసీయులకు 6:18-19 పవిత్ర బైబిల్ (TERV)
ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి. నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను.
ఎఫెసీయులకు 6:18-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు
ఎఫెసీయులకు 6:18-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి పరిశుద్ధులందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి. సువార్త మర్మాన్ని నేను భయం లేకుండా తెలియజేయడానికి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు మాటలు అనుగ్రహించబడేలా నా కోసం కూడా ప్రార్థన చేయండి.