ఎఫెసీయులకు 5:8-10
ఎఫెసీయులకు 5:8-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి.
ఎఫెసీయులకు 5:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ
ఎఫెసీయులకు 5:8-10 పవిత్ర బైబిల్ (TERV)
ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి.
ఎఫెసీయులకు 5:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
ఎఫెసీయులకు 5:8-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)