ఎఫెసీయులకు 5:7-11
ఎఫెసీయులకు 5:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
ఎఫెసీయులకు 5:7-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
గనుక అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై యున్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై యున్నారు. కనుక వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగివుంటుంది. కనుక ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియల్లో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
ఎఫెసీయులకు 5:7-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి వారికి దూరంగా ఉండండి. గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
ఎఫెసీయులకు 5:7-11 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి.
ఎఫెసీయులకు 5:7-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.