ఎఫెసీయులకు 4:28-29
ఎఫెసీయులకు 4:27-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.
ఎఫెసీయులకు 4:28-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దొంగతనం చేసేవారు ఇక మీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.
ఎఫెసీయులకు 4:28-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి. మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
ఎఫెసీయులకు 4:28-29 పవిత్ర బైబిల్ (TERV)
దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు. దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి.
ఎఫెసీయులకు 4:28-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.