ఎఫెసీయులకు 1:7-9
ఎఫెసీయులకు 1:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.
ఎఫెసీయులకు 1:7-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగి ఉన్నాము. ఆ కృపను ఎంత ధారాళంగా కుమ్మరించారంటే, దానితో మనకు సంపూర్ణమైన జ్ఞానం, వివేచనను ఇచ్చి, క్రీస్తులో ఆయన ఉద్దేశించిన తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని తన దయాసంకల్పానికి అనుగుణంగా మనకు తెలియజేశారు.
ఎఫెసీయులకు 1:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది. ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు. ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
ఎఫెసీయులకు 1:7-9 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు.
ఎఫెసీయులకు 1:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.
ఎఫెసీయులకు 1:7-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)