ప్రసంగి 8:16-17
ప్రసంగి 8:16-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసి కొంటిని.
ప్రసంగి 8:16-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జ్ఞానాన్ని పొందడానికి, భూమిపై ప్రజలు పగలు రాత్రి నిద్రలేకుండ చేసే శ్రమను గమనించడానికి నేను నా మనస్సును నిలిపినప్పుడు దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను.
ప్రసంగి 8:16-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను. దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.
ప్రసంగి 8:16-17 పవిత్ర బైబిల్ (TERV)
ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
ప్రసంగి 8:16-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రకానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసి కొంటిని.
ప్రసంగి 8:16-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)