ప్రసంగి 5:15-17
ప్రసంగి 5:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు. తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి? ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.
ప్రసంగి 5:15-17 పవిత్ర బైబిల్ (TERV)
తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయినప్పుడు అతను తన వెంట తీసుకువెళ్లగలిగింది ఏమీ ఉండదు. ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి? దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!
ప్రసంగి 5:15-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు; అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
ప్రసంగి 5:15-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే దిగంబరిగానే వెళ్లిపోతారు. తాము కష్టపడిన దానిలో నుండి వారు తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు. మరొక చెడ్డ విషయం: ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు, వారు గాలికి ప్రయాసపడుతున్నారు కాబట్టి వారు ఏమి పొందుతారు? వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో, తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు.