ప్రసంగి 4:9-11
ప్రసంగి 4:9-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది: ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు. అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
ప్రసంగి 4:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు. అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది. ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
ప్రసంగి 4:9-11 పవిత్ర బైబిల్ (TERV)
ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు. ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయపడేవాడు ఎవడూ వుండడు. ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.
ప్రసంగి 4:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును?
ప్రసంగి 4:9-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది: ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు. అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?