ద్వితీయోపదేశకాండము 5:21 - Compare All Versions
ద్వితీయోపదేశకాండము 5:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 5 TSAద్వితీయోపదేశకాండము 5:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 5 IRVTELద్వితీయోపదేశకాండము 5:21 TERV (పవిత్ర బైబిల్)
“మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.”
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 5 TERVద్వితీయోపదేశకాండము 5:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
షేర్ చేయి
ద్వితీయోపదేశకాండము 5 TELUBSI