ద్వితీయోపదేశకాండము 32:1-4
ద్వితీయోపదేశకాండము 32:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను; భూమీ, నా నోటి మాటలు విను. నా ఉపదేశం వర్షంలా కురుస్తుంది నా మాటలు మంచు బిందువుల్లా దిగుతాయి, లేతగడ్డి మీద జల్లులా, లేత మొక్కల మీద సమృద్ధి వర్షంలా ఉంటుంది. నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి! ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
ద్వితీయోపదేశకాండము 32:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి. ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
ద్వితీయోపదేశకాండము 32:1-4 పవిత్ర బైబిల్ (TERV)
“ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను. భూమి నానోటి మాటలు వినునుగాక! నా ప్రబోధం వర్షంలా పడుతుంది, నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది. కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది. యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి! “ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు ఆయన పని పరిపూర్ణం! ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక. ఆయన సత్యవంతుడు నమ్ముకోదగ్గ దేవుడు.
ద్వితీయోపదేశకాండము 32:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
ద్వితీయోపదేశకాండము 32:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)