ద్వితీయోపదేశకాండము 31:1-6

ద్వితీయోపదేశకాండము 31:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు: “నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు. మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు. అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు. యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”

ద్వితీయోపదేశకాండము 31:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు, “నాకు ఇప్పుడు 120 ఏళ్ళు. ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు. మీ యెహోవా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాలను మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు. యెహోవా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకూ, వారి దేశాలకూ ఏమి జరిగించాడో అలానే వారికీ చేస్తాడు. మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారిపట్ల చెయ్యండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

ద్వితీయోపదేశకాండము 31:1-6 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు. మోషే వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిపించలేను. ‘నీవు యొర్దాను నది దాటి వెళ్లవు’ అని యెహోవా నాతో చెప్పాడు. మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు: “అమోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేసాడు. మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చేప్పిన విషయాలన్నీ మీరు వాళ్లకు చేయాలి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”

ద్వితీయోపదేశకాండము 31:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను–నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను. ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆప్రకారముగానే యీ జనములకును చేయును. నేను మీకాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.

ద్వితీయోపదేశకాండము 31:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)