ద్వితీయోపదేశకాండము 17:18-20
ద్వితీయోపదేశకాండము 17:18-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి. అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు, తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.
ద్వితీయోపదేశకాండము 17:18-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి. అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.”
ద్వితీయోపదేశకాండము 17:18-20 పవిత్ర బైబిల్ (TERV)
“ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి. రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ అతడు నేర్చుకొంటాడు. అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. అతడు ధర్మశాస్త్రానికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, అతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.
ద్వితీయోపదేశకాండము 17:18-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను; అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలుమధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై
ద్వితీయోపదేశకాండము 17:18-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)