దానియేలు 9:18
దానియేలు 9:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్ట బడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.
దానియేలు 9:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.
దానియేలు 9:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ మహా కనికరాన్ని బట్టి మాత్రమే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము గాని మా సొంత నీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, ఆలకించు. నీ కళ్ళు తెరచి, నీ పేరు పెట్టిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనాన్ని, నీ పేరు పెట్టిన ఈ పట్టణాన్ని తేరి చూడు.
దానియేలు 9:18 పవిత్ర బైబిల్ (TERV)
నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన, నీ పేరు పెట్టబడిన ఈ నగరముపైన నీ దృష్టినుంచుము. మేము నీతిమంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము.