దానియేలు 9:16
దానియేలు 9:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి.
దానియేలు 9:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభూ, మా పాపాలనుబట్టి, మా పూర్వీకుల దోషాన్ని బట్టి, యెరూషలేము నీ ప్రజల చుట్టుపక్కల ఉన్న జాతులన్నిటి ఎదుట నింద పాలయింది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపాన్ని నీ రౌద్రాన్ని మళ్లించుకోమని నీ నీతిగల కార్యాలన్నిటిని బట్టి విన్నపం చేసుకుంటున్నాను.
దానియేలు 9:16 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో ఉంచుకొని, పరిశుద్ధ పట్టణంపట్ల, యెరూషలేంపట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాలవల్ల, మా పూర్వీకుల అపరాధాలవల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
దానియేలు 9:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.