అపొస్తలుల కార్యములు 26:24-32

అపొస్తలుల కార్యములు 26:24-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి –ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి. అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 26:24-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు. అందుకు పౌలు, “ఘనత వహించిన ఫేస్తు అధిపతి, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్పేది సత్యం సమంజసము. ఈ సంగతులు రాజుకు తెలిసినవే కాబట్టి నేను ఆయనతో ధైర్యంగా చెప్పుకోగలను. అయినా ఈ సంగతులు ఒక మూలలో జరిగినవి కావు, కాబట్టి వీటిలో ఏది ఆయన దృష్టిలో నుండి తప్పిపోదని నేను నమ్ముతున్నాను. అగ్రిప్ప రాజా, నీవు ప్రవక్తలను నమ్ముతున్నావా? అవునని నాకు తెలుసు” అని అన్నాడు. అప్పుడు అగ్రిప్ప పౌలుతో, “ఇంత తక్కువ సమయంలోనే నన్ను క్రైస్తవునిగా మార్చగలనని నీవు అనుకుంటున్నావా?” అన్నాడు. అందుకు పౌలు, “తక్కువ సమయమైనా ఎక్కువ సమయమైనా, నీవే కాదు ఈ రోజు ఈ సంకెళ్ళు తప్ప నా మాటలు వింటున్న వారందరు నాలా మారాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను” అని చెప్పాడు. అగ్రిప్ప రాజు లేచాడు, అతనితో పాటు ఫేస్తు, బెర్నీకే వారితో కూర్చున్న వారందరు లేచారు. వారు ఆ గదిని విడిచి వెళ్లిన తర్వాత వారు ఒకరితో ఒకరు, “ఇతడు మరణశిక్ష పొందడానికి గాని చెరసాలలో బంధించడానికి గాని తగిన తప్పు ఏది చేయలేదు” అని చెప్పుకొన్నారు. అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తు అధిపతితో, “ఇతడు కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటాను అనకపోతే విడుదల చేయబడి ఉండేవాడు” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 26:24-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు. అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను. రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు. అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు. అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు. అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి “ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు. అప్పుడు అగ్రిప్ప, “ఈ మనిషి సీజరు ముందు చెప్పుకొంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే” అని ఫేస్తుతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 26:24-32 పవిత్ర బైబిల్ (TERV)

పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు. పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు. అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు. పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు. రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్నవాళ్ళు లేచి నిలుచున్నారు. వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణదండన పొందటానికి కాని, కారాగారంలో ఉండవలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు. అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.

అపొస్తలుల కార్యములు 26:24-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి –ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి. అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 26:24-32 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)