అపొస్తలుల కార్యములు 18:18-19
అపొస్తలుల కార్యములు 18:18-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల వద్ద సెలవు తీసుకొని, ప్రిస్కిల్ల మరియు అకులతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకొన్నాడు. వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు ప్రిస్కిల్ల మరియు అకులను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.
అపొస్తలుల కార్యములు 18:18-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు. వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
అపొస్తలుల కార్యములు 18:18-19 పవిత్ర బైబిల్ (TERV)
పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను, అకులను వదిలి తానొక్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు.
అపొస్తలుల కార్యములు 18:18-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
అపొస్తలుల కార్యములు 18:18-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు. వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.