2 తిమోతికి 3:2-7

2 తిమోతికి 3:2-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింప బడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.

షేర్ చేయి
Read 2 తిమోతికి 3

2 తిమోతికి 3:2-7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఎందుకంటే, ప్రజలు స్వార్ధపరులుగా, ధనాన్ని ప్రేమించేవారిగా, గొప్పలు చెప్పుకునేవారిగా, అహంకారులుగా, దూషించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా, ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా, ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా, దైవభక్తి కలిగివున్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు. అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్లలో చొరబడి వారిని లోబరుచుకుంటారు. ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.

షేర్ చేయి
Read 2 తిమోతికి 3

2 తిమోతికి 3:2-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు. ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు. వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.

షేర్ చేయి
Read 2 తిమోతికి 3

2 తిమోతికి 3:2-7 పవిత్ర బైబిల్ (TERV)

మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు. వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.

షేర్ చేయి
Read 2 తిమోతికి 3

2 తిమోతికి 3:2-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఎందుకంటే, ప్రజలు స్వార్థపరులుగా, ధనాన్ని ప్రేమించేవారిగా, గొప్పలు చెప్పుకునేవారిగా, అహంకారులుగా, దూషించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా, ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా, ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా, దైవభక్తి కలిగి ఉన్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు. అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్ళలో చొరబడి వారిని లోబరుచుకుంటారు. ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.

షేర్ చేయి
Read 2 తిమోతికి 3