2 తిమోతికి 2:11-13
2 తిమోతికి 2:11-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతోపాటు చనిపోతే, ఆయనతోపాటు మనం కూడా జీవిస్తాము; మనం భరిస్తే, ఆయనతోపాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనలను తిరస్కరిస్తారు; మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
2 తిమోతికి 2:11-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం. కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు. ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి.
2 తిమోతికి 2:11-13 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం. మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం! మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు. మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
2 తిమోతికి 2:11-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
2 తిమోతికి 2:11-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము; మనం భరిస్తే, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు; మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.