2 సమూయేలు 22:3-4
2 సమూయేలు 22:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
2 సమూయేలు 22:3-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు. స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.
2 సమూయేలు 22:3-4 పవిత్ర బైబిల్ (TERV)
సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు! యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!
2 సమూయేలు 22:3-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు. “స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.