2 కొరింథీయులకు 9:7-9
2 కొరింథీయులకు 9:7-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక అయిష్టంగా లేదా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగల సమర్థుడు, అప్పుడు అన్ని విషయాల్లో, అన్నివేళల్లో, మీకు కావలసినవన్ని కలిగివుండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉంటారు. ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”
2 కొరింథీయులకు 9:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు. దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.
2 కొరింథీయులకు 9:7-9 పవిత్ర బైబిల్ (TERV)
ఆనందంగా యిచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు: “అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు అతని నీతి చిరకాలం ఉంటుంది.”
2 కొరింథీయులకు 9:7-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిం చును. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
2 కొరింథీయులకు 9:7-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారు కాబట్టి అయిష్టంగా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి. అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు. దీని గురించి ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”