2 కొరింథీయులకు 12:2-4
2 కొరింథీయులకు 12:2-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేదా శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.
2 కొరింథీయులకు 12:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.
2 కొరింథీయులకు 12:2-4 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు.
2 కొరింథీయులకు 12:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపో బడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
2 కొరింథీయులకు 12:2-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)