2 కొరింథీయులకు 11:30-33
2 కొరింథీయులకు 11:30-33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను. ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రియైన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు. దమస్కులో అరెత అనే రాజు క్రింది అధిపతి నన్ను బంధించడానికి పట్టణం చుట్టూ కాపలా ఉంచాడు. కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను.
2 కొరింథీయులకు 11:30-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను. ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు. దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు. అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.
2 కొరింథీయులకు 11:30-33 పవిత్ర బైబిల్ (TERV)
నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.
2 కొరింథీయులకు 11:30-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును. నేనబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును. దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతనిచేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
2 కొరింథీయులకు 11:30-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)