1 థెస్సలొనీకయులకు 4:15-17
1 థెస్సలొనీకయులకు 4:15-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రభువు చెప్పిన మాటను బట్టి మేము మీతో చెప్పేది ఏంటంటే, ప్రభువు తిరిగి వచ్చేవరకు బ్రతికి ఉండే మనం చనిపోయినవారికంటె ముందుగా ఆయన సన్నిధికి చేరము. ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు. ఆ తర్వాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.
1 థెస్సలొనీకయులకు 4:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
1 థెస్సలొనీకయులకు 4:15-17 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము.
1 థెస్సలొనీకయులకు 4:15-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము ప్రభువుమాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభు వుతోకూడ ఉందుము.
1 థెస్సలొనీకయులకు 4:15-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)