1 థెస్సలొనీకయులకు 3:4-5
1 థెస్సలొనీకయులకు 3:4-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నిజానికి, మనకు శ్రమలు వస్తాయని, మేము మీతో ఉన్నపుడు మీతో చెప్తూనే ఉన్నాము. అలాగే జరిగిందని మీకు తెలుసు. ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, గనుకనే ఇక నేను వేచివుండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను.
1 థెస్సలొనీకయులకు 3:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది. అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
1 థెస్సలొనీకయులకు 3:4-5 పవిత్ర బైబిల్ (TERV)
నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే ఉంటారు. ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతణ్ణి పంపాను. ఏదో ఒక విధంగా సాతాను మిమ్మల్ని శోధిస్తాడని, నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను.
1 థెస్సలొనీకయులకు 3:2-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.
1 థెస్సలొనీకయులకు 3:4-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నిజానికి, మనకు శ్రమలు వస్తాయని, మేము మీతో ఉన్నపుడు మీతో చెప్తూనే ఉన్నాము. అలాగే జరిగిందని మీకు తెలుసు. ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, కాబట్టి ఇక నేను వేచి ఉండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను.