1 థెస్సలొనీకయులకు 1:5-6
1 థెస్సలొనీకయులకు 1:5-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు.
1 థెస్సలొనీకయులకు 1:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు. మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు.
1 థెస్సలొనీకయులకు 1:5-6 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
1 థెస్సలొనీకయులకు 1:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.
1 థెస్సలొనీకయులకు 1:5-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు.