1 థెస్సలొనీకయులకు 1:3-5

1 థెస్సలొనీకయులకు 1:3-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు. ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.

1 థెస్సలొనీకయులకు 1:3-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.

1 థెస్సలొనీకయులకు 1:2-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనముచేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.

1 థెస్సలొనీకయులకు 1:3-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)