1 సమూయేలు 20:21
1 సమూయేలు 20:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
‘వెళ్లి బాణాలను వెదకు’ అని ఒక పనివాన్ని పంపుతాను. నేను అతనితో, ‘ఇటువైపు ఉన్న బాణాలు చూడు; వాటిని తీసుకురా’ అని చెప్తే నీవు రావచ్చు; ఎందుకంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీకు ఏ ప్రమాదం ఉండదు నీవు క్షేమంగా ఉంటావు.
1 సమూయేలు 20:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘నీవు వెళ్లి బాణాలు వెతుకు’ అని ఒక పనివాడితో చెబుతాను, ‘బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా’ అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుతుంది.
1 సమూయేలు 20:21 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబుతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు.
1 సమూయేలు 20:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పని వానితో చెప్పుదును–బాణములు నీకు ఈతట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.
1 సమూయేలు 20:21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)