1 సమూయేలు 18:10-11
1 సమూయేలు 18:10-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది. సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.
1 సమూయేలు 18:10-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు. ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
1 సమూయేలు 18:10-11 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది. “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలంచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.
1 సమూయేలు 18:10-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదుమునుపటిలాగున వీణచేతపట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా–దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.
1 సమూయేలు 18:10-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)