1 పేతురు 4:17-19
1 పేతురు 4:17-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైనది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు, అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి? మరియు, “నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?” కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.
1 పేతురు 4:17-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి? నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.
1 పేతురు 4:17-19 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది? లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే, నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమౌతుంది?” అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
1 పేతురు 4:17-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
1 పేతురు 4:17-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి? అలాగే, “నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?” కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.