1 యోహాను 4:4-6
1 యోహాను 4:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. వారు లోకసంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.
1 యోహాను 4:4-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్న వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు. వారు లోకానికి చెందినవారు కనుక లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది. కాని మనం దేవునికి చెందినవారము, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కనుక సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనం గుర్తిస్తాము.
1 యోహాను 4:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
1 యోహాను 4:4-6 పవిత్ర బైబిల్ (TERV)
బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.
1 యోహాను 4:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు. వారు లోకానికి చెందినవారు కాబట్టి లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది. కాని మనం దేవునికి చెందినవారం, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కాబట్టి సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనకు తెలుస్తుంది.