1 కొరింథీయులకు 6:12-14
1 కొరింథీయులకు 6:12-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని లాభకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉంది” కాని, నన్ను దేనిని లోపరచుకోనివ్వను. “ఆహారం కడుపు కొరకు, కడుపు ఆహారం కొరకు నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తాడు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కొరకు కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే. దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపాడు. కనుక ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతాడు.
1 కొరింథీయులకు 6:12-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను. ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.
1 కొరింథీయులకు 6:12-14 పవిత్ర బైబిల్ (TERV)
“ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు.
1 కొరింథీయులకు 6:12-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.
1 కొరింథీయులకు 6:12-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు” కాని, నేను దేనికి లొంగిపోను. “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే. దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపారు. కాబట్టి ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతారు.