1 దినవృత్తాంతములు 9:35-39
1 దినవృత్తాంతములు 9:35-39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. అతని మొదటి కుమారుడు అబ్దోను, తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు పుట్టారు. మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు. నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
1 దినవృత్తాంతములు 9:35-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా. ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు. మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు. నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
1 దినవృత్తాంతములు 9:35-39 పవిత్ర బైబిల్ (TERV)
గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు. మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు. నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.
1 దినవృత్తాంతములు 9:35-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా. ఇతని పెద్దకుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతోకూడ తమ సహోదరులకు ఎదురుగా నున్న యిండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూ వను అబీనాదాబును ఎష్బయలును కనెను.
1 దినవృత్తాంతములు 9:35-39 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)