1 దినవృత్తాంతములు 26:20-27

1 దినవృత్తాంతములు 26:20-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులనుగూర్చినది–గెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమపితరులయిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు. అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్క సముమీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయు వారైరి.

1 దినవృత్తాంతములు 26:20-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు. గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన కుటుంబాల పెద్దలైన గెర్షోనీయుడైన లద్దాను వారసులు యెహీయేలీ, యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనేవారి నుండి: మోషే కుమారుడైన గెర్షోము వారసుడు షెబూయేలు ఖజానా మీద ప్రధానిగా నియమించబడ్డాడు. ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు. (రాజైన దావీదు, సహస్రాధిపతులు, శతాధిపతులు యైన కుటుంబ పెద్దలు ఇతర సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన వస్తువులున్న ఖజానాలన్నిటి బాధ్యత షెలోమీతుకు, అతని బంధువులకు అప్పగించబడింది. వారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని యెహోవా ఆలయ మరమత్తు కోసం ప్రతిష్ఠించారు.

1 దినవృత్తాంతములు 26:20-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది. ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది. యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు. ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది. మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది. ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే, అతని కొడుకు రెహబ్యా, రెహబ్యా కొడుకు యెషయా, యెషయా కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు జిఖ్రీ, జిఖ్రీ కొడుకు షెలోమీతు. రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు. యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.

1 దినవృత్తాంతములు 26:20-27 పవిత్ర బైబిల్ (TERV)

అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత. గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు. యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత. ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు. ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే. షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు. షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు. సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు. వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు.

1 దినవృత్తాంతములు 26:20-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులనుగూర్చినది–గెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమపితరులయిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు. అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్క సముమీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయు వారైరి.

1 దినవృత్తాంతములు 26:20-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)