1 దినవృత్తాంతములు 1:1-54

1 దినవృత్తాంతములు 1:1-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు. ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు. యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు. లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు. యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు. యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు. కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు. కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత. ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే. కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు. ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా. షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు. అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు. ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను. యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, హదోరము, ఊజాలు, దిక్లాను, ఏబాలు, అబీమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు. షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు, ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ, రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు, తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు. అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు. వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు. అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు. మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం. అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు. ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు. వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు. రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా. అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను. ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు. యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు. శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు. షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు. బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది. హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు, అహలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.

1 దినవృత్తాంతములు 1:1-54 పవిత్ర బైబిల్ (TERV)

ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు. అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు. ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము అనేవారు యావాను కుమారులు. కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు. సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా కుమారులు. నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త. అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు. కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు, హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు, అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త. షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు. అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు. ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు. అతని కాలంలో భూమి విభాగింపబడిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, హదోరము, ఊజాలు, దిక్లాను, ఏబాలు, అబీమాయేలు, షేబ, ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.) అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయూ, సెరూగు, నాహోరు, తెరహు, మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము. అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు. ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు. కెతూరా అబ్రాహాముకు దాసి. ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షానుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు. ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు. ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు. ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు. తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు. నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు. లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు. హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి. అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను వారిరువురూ సిబ్యోను కుమారులు. అనా కుమారుని పేరు దిషోను. అమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కెరాను అనువారు దిషోను కుమారులు. బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు. ఊజు, అరానులు ఇరువురూ దిషాను కుమారులు. ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా. బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు. యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు. హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు. హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి. శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు. షావూలు మరణానంతరం బయల్ – హానాను రాజయ్యాడు. బయల్ – హానాను తండ్రి పేరు అక్బోరు. బయల్ – హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె. కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు, అహలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.

1 దినవృత్తాంతములు 1:1-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆదాము షేతు ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు మెతూషెల లెమెకు నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షేబ దదాను. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లాను ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమా మశ్శా హదదు తేమా యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబ దెదాను. మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు. ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ. శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను. లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహొలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.

1 దినవృత్తాంతములు 1:1-54 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా. యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను. కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను. కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు. ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు. కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు. యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, హదోరము, ఊజాలు, దిక్లా, ఓబాలు, అబీమాయేలు, షేబ, ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయూ, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రాము (అనగా అబ్రాహాము). అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు. వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము, మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను. మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతానము. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు. ఏశావు కుమారులు: ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. అనా కుమారుడు: దిషోను. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను. ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు. బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె. హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు, ఒహోలీబామా, ఏలహు, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరు ఎదోము నాయకులు.