కీర్తనలు 86:1-7

కీర్తనలు 86:1-7 OTSA

యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను. మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి; మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు; ప్రభువా! నాపై దయచూపండి. దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను. ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి, ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను. ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు. యెహోవా, నా ప్రార్థన వినండి; నా మనవుల ధ్వని ఆలకించండి. నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు.