కీర్తనలు 71:17-24

కీర్తనలు 71:17-24 OTSA

దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను. నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి. దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది, మీరు గొప్ప వాటిని చేశారు. దేవా, మీలాంటి వారెవరు? మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; భూమి యొక్క లోతుల నుండి మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు. మీరు నా గౌరవాన్ని పెంచుతారు మరోసారి నన్ను ఓదార్చుతారు. నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు విడిపించిన నేను మీకు స్తుతి పాడినప్పుడు నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి. రోజంతా నా నాలుక మీ నీతిక్రియలను గురించి చెప్తుంది, ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.