కీర్తనలు 71:1-6

కీర్తనలు 71:1-6 OTSA

యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి. మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి. నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి. నా దేవా, దుష్టుల చేతి నుండి, చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి. ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం. పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.