నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను. మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి. కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి; అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు. విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు. నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు. వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, ఒక్క ఎముక కూడా విరగదు. చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది; నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు. యెహోవా తన సేవకులను విడిపిస్తారు; ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.
చదువండి కీర్తనలు 34
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 34:11-22
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు