నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి, ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు. వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు, కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను. నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు. నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి. తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి. అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక. అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి. అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక, వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక. అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి; అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి. అతని మీద ఎవరు దయ చూపకూడదు, తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు. అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.
చదువండి కీర్తనలు 109
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 109:1-13
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు