కీర్తనలు 107:35-43

కీర్తనలు 107:35-43 OTSA

అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది. ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు. వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు అధికంగా అభివృద్ధి చెందారు. పశుసంపద ఏమాత్రం తగ్గలేదు. వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము. వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది. సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు. కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు. యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము. దుష్టులంతా నోరు మూసుకోవాలి. జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు, యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు.