కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు, వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు. కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు ఇనుప గడియలను విరగ్గొడతారు. కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు. వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక
చదువండి కీర్తనలు 107
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 107:10-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు