జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు, వివేచన కలిగినవారు ధన్యులు. ఎందుకంటే ఆమె వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం, ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది. ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది; నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు; ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి. దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి దాని త్రోవలన్ని సమాధానకరమైనవి. ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు. యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు; ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి. మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి. నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు; అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు. నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది. హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు. యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.
చదువండి సామెతలు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సామెతలు 3:13-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు