నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు. ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు, కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు. హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు సమాధిలో ఆశ్రయం వెదకుతారు; ఎవరు వారిని ఆపకూడదు. ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు, కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు. తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది. నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు. పక్షపాతం చూపడం మంచిది కాదు అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు. పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు. నాలుకతో పొగిడే వారికన్నా, మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు. తన తల్లిదండ్రులను దోచుకొని “ఇది ద్రోహం కాదు” అనేవాడు నాశనం చేసేవానికి భాగస్వామి. దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు. తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు. పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి. దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.
చదువండి సామెతలు 28
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సామెతలు 28:15-28
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు