సామెతలు 26:17-28

సామెతలు 26:17-28 OTSA

తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు. తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు. కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది. నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి. చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి. పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు. వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి. వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది. గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది. అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.

Read సామెతలు 26