యెషయా 42:1-8

యెషయా 42:1-8 OTSA

“ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు. అతడు కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు; భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.” ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను. “నేనే యెహోవాను. అదే నా పేరు! నా మహిమను నేను మరొకరికి ఇవ్వను నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.

యెషయా 42:1-8 కోసం వీడియో